మంత్రి టార్గెట్ గానే ఐటి దాడులు?!

Update: 2022-08-17 14:05 GMT

Full Viewఆయ‌నే అస‌లు టార్గెట్. బుద‌వారం నాడు హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న ఐటి దాడులు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఓ మంత్రి టార్గెట్ గానే ఈ వ్య‌వ‌హారం అంతా ప‌క్కా ప్లాన్ తో సాగుతున్న‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. కూక‌ట్ ప‌ల్లి స‌మీపంలోని ఓ కార్పొరేట్ కంపెనీకి చెందిన స్థ‌లం డీల్ లో మంత్రి కీలక పాత్ర పోషించార‌ని..ఈ సంస్థ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు అధికార వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ద‌రు మంత్రితోపాటు మ‌రికొంత మంది కూడా ఈ సంస్థ‌లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. దాడులు పూర్త‌యి ఐటి శాఖ విష‌యాలు బ‌హిర్గ‌తం చేస్తే ప‌లు సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి రావ‌టం ఖాయం అని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వాస‌వి సంస్థ ప‌లు వెంచ‌ర్ల‌కు సంబంధించి కూడా ప్రీలాంచ్ పేరుతో భారీ ఎత్తున వ‌సూళ్ళ‌కు పాల్ప‌డిన‌ట్లు చెబుతున్నారు. కంపెనీ ఆదాయానికి..ప‌న్ను చెల్లింపుల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం వ‌ల్లే ఐటి దాడులు అని ప్ర‌చారం జ‌రుగుతున్నా..దీని వెన‌క భారీ ఏజెండా ఉంద‌ని ఓ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. ఒకేసారి ఏకంగా 40 చోట్ల‌..వాస‌వీ ప్ర‌మోట‌ర్ల ఇళ్ల‌లోనూ, కార్యాల‌యాల్లోనూ.దీనికి సంబంధించిన ప‌లు చోట్ల దాడులు జ‌రుగుతుండ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.


Tags:    

Similar News