తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం నాడు శాసనసభలో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2,30,825.96 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఐఫ్యాడ్ లు గిఫ్ట్ లుగా ఇఛ్చింది.
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇలా గిఫ్ట్ లు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఓ వైపు ఆర్ధిక పరిస్థితి ఏమీబాగాలేదని..కరోనా వల్ల అంతా దెబ్బతిన్నదని చెబుతూనే లక్షలకు లక్షల రూపాయల వేతనాలు పొందే ఎమ్మెల్యేలకు ఈ సమయంలో గిఫ్ట్ లు అవసరమా అన్న చర్చ సాగుతోంది.