కొత్త ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దారి ఎటు?!

Update: 2022-12-31 10:05 GMT

Full Viewగత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరుగులేకుండా దూసుకెళుతుంది. ఒక వైపు ఇన్వెంటరీలు అంటే అమ్ముడుపోని ఇళ్ళు, అపార్టుమెంట్లు ఉన్నా కూడా ప్రీమియం సెగ్మెంట్లో మాత్రం దూకుడు ఆగటం లేదు. దీనికి ప్రధాన కారణం..ఇతర కీలక నగరాలు అయిన ముంబయి, ఢిల్లీ వంటి వాటితో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటం...హైదరాబాద్ లో ఉన్నా మెరుగైన మౌలికవసతులు కూడా రియల్ ఎస్టేట్ బూమ్ కు ప్రధాన కారణం. స్టాక్ మార్కెట్ లో వచ్చిన తరహాలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ కరెక్షన్ రాలేదు. ఇది 2023 లో ఉండే అవకాశం ఉండనే అంచనాలు బలంగా ఉన్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వచ్చేది ఎన్నికల ఏడాది. ఎన్నికల సమయంలో పెద్దగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆచితూచి అడుగులు వేస్తారు. దీనికి పలు కారణాలు ఉంటాయి. మరో ముఖ్యమైన అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023 లో ఖచ్చితంగా మాంద్యం ఎదుర్కొక తప్పదనే అంచనాలు బలంగా ఉన్నాయి.

                                   ఇందుకు భారత్ ఏమి మినహాయిపు కాదు. కాకపోతే తీవ్రత కాస్త తక్కువ ఉండొచ్చు. అమెరికా తో పాటు పలు కీలక దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత వేశాయి. అవి వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. వీటితో పాటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్ల పెంపు కొత్త ఏడాది కూడా కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇవి అన్నీ చూస్తే ఖచ్చితంగా 2023 సంవత్సరం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు అత్యంత కీలకం కానుంది. ఈ రంగంలోని వారు కొత్త ఏడాది కూడా ఎలాంటి డోకా ఉండదు అని చెపుతున్న ఎన్నికలు, మాంద్యం వంటి అంశాలను గమనంలోకి తీసుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది అని చెపుతున్నారు ఈ రంగంలోని నిపుణులు. అయితే కొత్త ఇళ్ళు కొనుగోలు చేయాలనీ ఆసక్తి ఉన్నవారికి మాత్రం కొత్త ఏడాది పలు అవకాశాలు అందించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. 

Tags:    

Similar News