హైదరాబాద్ మెట్రో అరుదైన ఫీట్...గ్రీన్ ఛానల్ లో గుండె తరలింపు

Update: 2021-02-02 13:01 GMT

నగర రోడ్ల మీద ట్రాఫిక్ ఎంత నరకంలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు అంబులెన్స్ లకు కూడా దారి దొరకదు. ట్రాఫిక్ ను దాటుకుని అవి హాస్పిటల్స్ కు చేరే సమయానికి కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. అలాంటి అత్యంత కీలకమైన గుండెను సకాలంలో ఆస్పత్రికి చేర్చాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లో అదే జరిగింది. అయితే ఇందుకు మెట్రో రైలును ఉపయోగించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకూ ఎక్కడా ఆగకుండా ప్రయాణించటం ద్వారా ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో వున్న రోగికి గుండెను మార్పిడి చేయటం కోసం ఎల్ బీ నగర్ లో ని కామినేని హాస్పిటల్ నుంచి గుండె ను తరలించారు. నాగోల్ లో ఓ ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేసి గుండె ను తరలించారు. మొత్తం 21 కిలోమీటర్లు... 16 స్టేషన్స్ ను నాగోల్ మరియు జూబ్లీహిల్స్ నడుమ ఈ రైలు ప్రయాణించింది.

కేవలం 30 నిమిషాల లోపుగానే గంటకు 40 కిలోమీటర్ల వేగం తో జూబ్లీహిల్స్ చేరింది. అన్ని స్టేషన్స్ లో నూ పి ఏ సిస్టమ్ ద్వారా ఈ ప్రత్యేక రైలు గురించి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గుండె ను హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటుపై ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీ, సీఈవో కె వి బి రెడ్డి మాట్లాడుతూ 'మేము ఎప్పుడూ ప్రజల సేవలోనే ఉంటాం. ఓ నిండు ప్రాణం కాపాడటానికి మా వనరులన్నీ ఉపయోగించుకునేందుకు భగవంతుడు మాకు ఓ అవకాశం అందించాడు. కామినేని, అపోలో హాస్పిటల్స్ కు నేను ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాను. వారు ఈ మహోన్నత అభ్యర్ధన తో మమ్మల్ని చేరుకున్నారు. మేము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేక గ్రీన్ కారి డార్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక రైలు ను నాగోల్ నుండి జూబ్లీహిల్స్ కు ఎక్కడా ఈ రైలు ప్రయాణించింది. సమయానికి గుండెను తరలించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడాం " అన్నారు.

Tags:    

Similar News