తెలంగాణ ప్రజలు ఎవరి మాట నమ్మాలి

Update: 2023-06-07 05:58 GMT

‘హైదరాబాద్ సిటీ కి ఉండే స్వాభావిక , భౌగోళిక అడ్వాంటేజ్ వల్లే ఐటి అనేది హైదరాబాద్ రావటం ప్రారంభం అయింది. దాన్ని అతి గొప్పగా నేనే చేస్తున్నా అని డబ్బా కొట్టుకుని మార్కెటింగ్ చేసుకున్నది చంద్రబాబు నాయుడు. ఆ డబ్బాలు మేము కొట్టం. రాష్ట్రం డబ్బా కొడతాం. దేశం డబ్బా కొడతాం’..(సీఎం కెసిఆర్ )

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఐటి రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు ప్రభుత్వ పని తీరుతో గణనీయ వృద్ధి నమోదు అయింది. రాష్ట్రానికి ఐటి రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి’. (మంత్రి కెటిఆర్)

ఇక ఈ విషయాలు పక్కన పెట్టి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా హైదరాబాద్ దేశంలోని ఐటి రంగంలో రెండవ ప్లేస్ లో ఉంది. మొదటి స్థానంలో బెంగళూరు ఉంది. ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే గత తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణాకి కొత్తగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు వచ్చాయి. తెలంగాణ సర్కారు కూడా టి హబ్ తో పాటు ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా ఐటి రంగం ప్రగతి కొనసాగింపునకు తన వంతు కృషి చేసింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్ పెరగటం తో సహజంగా వ్యాపార పరిమాణం కూడా పెరిగింది. మరో కీలక విషయం ఏమిటి అంటే ఐటి రంగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మానవవనరులు కూడా పెద్ద ఎత్తున ఉండటం రాష్ట్రానికి సానుకూల పరిణామం. ఐటి రంగం విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అవసరమైన భూమి కేటాయించటమే కీలకం. అదే సమయంలో ఐటి పాలసీ ప్రకారం రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వటం. అది టీడీపీ ప్రభుత్వం అయినా...కాంగ్రెస్ ప్రభుత్వం అయిందా...బిఆర్ఎస్ ప్రభుతం అయినా గోల్ మాల్ అంత భూ కేటాయింపుల సమయంలోనే సాగుతుంది. ఆయా కంపెనీలకు అవసరానికి మించి భూకేటాయింపులు చేస్తారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

                                 అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో ఐటి కంపెనీ లకు కేటాయించిన భూముల వివరాలు ఎప్పుడూ బహిర్గతం చేసిన దాఖలాలు లేవు. గతం లో అయితే ప్రతి కేటాయింపునకు సంబంధించి జీఓ లు నెట్ లో పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఎవరికి ఎంత ఇస్తున్నారు...అది పాలసీ ప్రకారమా లేదా అన్న డేటా లేదు. అంతే కాదు...ఐటి రంగం విషయానికి వస్తే 2014 నాటికే హైదరాబాద్ టేక్ ఆఫ్ అయి ఆటో మోడ్ లో ఉన్న ఫ్లైట్ పరిస్థితి కి చేరుకుంది అని....అయితే దీన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ముందుకు నడపటమే ప్రభుత్వం చేసిన మంచి పని అని ఒక ఐటి కంపెనీ అధినేత వ్యాఖ్యానించారు. ప్రతి ప్రభుత్వంలో జరిగే గోల్ మాల్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నారు అయన. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే దాంట్లో....చెప్పుకునే విధానంపై విమర్శలు ఉండోచ్చు కానీ...హైదరాబాద్ ఐటి రంగం అభివృద్ధిలో అయన కృషి వాస్తవం. ఇక సీఎం కెసిఆర్ విషయానికి వస్తే చంద్రబాబు చెపితే మాత్రం స్వాభావిక , భౌగోళిక అడ్వాంటేజ్ వాళ్ళ ఐటి అభివృద్ధి అయింది తప్ప అయన పాత్ర ఏమి లేదు అంటారు మరి అయన కొడుకు, ఐటి మంత్రి కెటి ఆర్ మాత్రం ఐటి రంగాన్ని తామే అగ్రస్థానంలో నిలిపామని చెప్పుకుంటే మాత్రం అంతా కరెక్ట్. లేదు కెసిఆర్ మాటల ప్రకారం అయితే ఇది అంతా ఇందులో బిఆర్ఎస్ సర్కారు...ఐటి మంత్రి కెటిఆర్ గొప్పతనం ఏమి లేదు. కేవలం హైదరాబాద్ సిటీ కి ఉండే స్వాభావిక , భౌగోళిక అడ్వాంటేజ్ వల్లే ఇది సాధ్యం అయింది అని ఒక నిర్ణయానికి రావాలి.

Tags:    

Similar News