ధరణి డేటాపై హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2020-12-08 13:11 GMT

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రజల దగ్గర నుంచి సేకరించే డేటాకు చట్టబద్ధమైన భధ్రత ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ధరణి పేరుతో ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించటంపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయొచ్చు హైకోర్టు తెలిపింది. అదే సమయంలో ధరణి‌పై స్టే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 10న మరోసారి ఈ అంశం కోర్టులో విచారణకు రానుంది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు.

దీనిపై ధర్మాసనం ధరణి జీవోల కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలోలాగానే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అడ్వకేట్ జరనల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News