నితిన్ నిర్ణయం వెనక..అంటే బిజెపి వైపు మొగ్గుచూపాలనే అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉంటుందనే చర్చ సాగుతోంది. టాలీవుడ్ హీరో నితిన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బిజెపి, జనసేన ఏపీలో పొత్తులో కొనసాగుతున్నాయి. భవిష్యత్ లోనూ కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హీరోలు చెపితే ఓటర్లు ఆయా పార్టీలకు ఓట్లు వేస్తారా? వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అటెన్షన్ డ్రా చేయటానికి..సభలకు జనాలను ఆకట్టుకోవటానికి మాత్రం వీళ్లు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పొచ్చు.