తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ కు అనుమతి మంజూరు చేసింది. అయితే వ్యాక్సిన్లను ఆయా ఆస్పత్రులు వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 45 సంవత్సరాల పైబడిన వారికే ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వాలని..అది కూడా కోవిన్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారికే ఇవ్వాలని స్పష్టం చేశారు.
నేరుగా వచ్చిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వటానికి అనుమతించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం 18-44 సంవత్సరాల మధ్య వారికి వ్యాక్సినేషన్ పై త్వరలో ప్రారంభం అవుతుందని..ఈ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని హెల్త్ డైరక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు..