జీఎంఆర్ ఇన్నోవెక్స్..నూతన ఆవిష్కరణలే లక్ష్యం

Update: 2021-04-03 15:24 GMT

విమానయాన రంగంలో నూతన ఆవిష్కరణల కోసం జీఎంఆర్ గ్రూప్ పలు సంస్థలతో కలసి కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇందులో పలు విభాగాలను భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. 'రేపటిని ఈరోజే సృష్టించడం' అనే లక్ష్యంతో జీఎంఆర్ గ్రూప్ జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరిట ఒక నూతన వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. ఈ ఆవిష్కరణలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీఎంఆర్ విమానాశ్రయాల విభాగం ఛైర్మన్ జీ బీఎస్ రాజు లు పాల్గొన్నారు. విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా భారతదేశంలో విమాన ప్రయాణాన్ని జీఎంఆర్ పునర్ నిర్వచించింది.

భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సొల్యూషన్, సొంతంగా రూపొందించిన సెల్ఫ్ సర్వీస్ చెకిన్, ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్, ఫేస్ రికగ్నిషన్ ఆధారిత ప్యాసింజర్ ప్రాసెసింగ్ వంటి ఆవిష్కరణలు ఇక్కడ అంతర్గత నైపుణ్యంతో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ఆవిష్కరణల ఆధారంగా, తమ వ్యాపారంలోని అన్ని పార్శ్వాలలో నూతన ఆవిష్కరణల కోసం ఒక వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో, జీఎంఆర్ ఇన్నోవెక్స్ అందరికీ అందుబాటులో ఉండే ఒక నమూనాగా, స్టార్టప్‌లు, కార్పొరేట్‌లు, ఇన్నోవేష న్ ఫ్లాట్ ఫామ్‌ల భాగస్వామ్యంలో 'ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్'గా పనిచేస్తుంది. పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు వినూత్న ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనడానికి, ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని పెంపొందించడానికి దోహదపడుతుంది. వివిధ స్టార్టప్‌లు, పరిశ్రమ భాగస్వాములు, జీఎంఆర్ ఉద్యోగులచే ఆవిష్కరణ కార్యకలాపాలకు వేదికగా పనిచేయడానికి హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఈ నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News