కెసిఆర్..కెటిఆర్ కు ఫాక్స్ కాన్ బిగ్ షాక్ !

Update: 2023-03-04 10:46 GMT

లక్ష ఉద్యోగాలు ...భారీ పెట్టుబడి అంటూ ఫాక్స్ కాన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేసిన హంగామాకు షాక్. భారత్ లో కొత్త పెట్టుబడులకు సంబంధించి తాము అటు తెలంగాణ తో కానీ..ఇటు కర్ణాటక తో కానీ ఎలాంటి ఖచ్చితమైన ..కట్టుబడి ఉండాల్సిన ఒప్పందాలు కుదుర్చుకోలేదు అని ఫాక్స్ కాన్ వివరణ ఇచ్చింది. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లు కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కెటిఆర్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనలు వచ్చాయి. తైవాన్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెడుతుంది అని..దీంతో లక్ష ఉద్యోగాలు వస్తాయంటూ పెద్ద హడావుడి చేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాము అసలు పెట్టుబడి విషయం, పత్రికల్లో వచ్చినట్లు ఉద్యోగాలు తాము చెప్పినవి కావు అంటూ కంపెనీ స్పష్టం చేసింది.

                                      తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే తరహా హడావుడి చేసింది. ఫాక్స్ కాన్ తమ రాష్ట్రం లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టబోతోంది...లక్ష ఉద్యోగాలు వస్తాయని అంటూ అక్కడి సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల క్లెయిమ్స్ ను ఖండించింది వీటికి సంబంధించి ఖచ్చితముగా అమలు చేయాల్సిన ఎలాంటి ఒప్పందాలు లేవు అని స్పష్టం చేసింది. ఫాక్స్ కాన్ స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతుంది అని...కంపెనీ తో పాటు అందరు భాగస్వాములకు ప్రయోజనం చేకూరేలా ప్రయత్నాలు చేస్తుంది అని ప్రకటించారు. దీంతో తెలంగాణ సర్కారు తో పాటు కర్ణాటక సర్కారు ఇరకాటం లో పడినట్లు అయింది. ఇది అంతా చూస్తుంటే రెండు ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనం కోసమే ఇలా చేసి ఉంటాయనే విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News