ఆహా కు మొత్తం 13 అవార్డు లు

Update: 2024-07-25 02:28 GMT

గ్యాబో నెట్ వర్క్ ప్రవేట్ లిమిటెడ్ తన తొలి ప్రయత్నంలో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సంస్థ గోదావరి నది పుట్టు పూర్వోత్తరాలు..ఇది ఎక్కడ నుంచి ప్రారంభం అయి ఎక్కడ వరకు వెళుతుంది అనే అంశాలతో తెరకెక్కించిన డాక్యూమెంటరీ ప్రముఖ ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) తో కలిసి నిర్వహించిన నెక్సా బెస్ట్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ నుంచి బెస్ట్ డాక్యూమెంటరీ అవార్డు దక్కించుకుంది.

                                              ఇటీవల ముంబై లో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి సంబంధించి బెస్ట్ డాక్యూమెంటరీ ఒరిజినల్ విభాగం కింద గోపావజ్జల దివాకర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రాంతీయ ఓటిటి గా ఉన్న ఆహా మొత్తం మీద పదమూడు నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ ను దక్కించుకుంది. ఆహా ఓటిటి లో ఈ డాక్యూమెంటరీ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. గోదావరి నదికి సంబంధించిన విషయాలతో తెలుగు లో ఒక డాక్యూమెంటరీ ని తెరకెక్కించింది కూడా ఇదే మొదటి సారి కావటం విశేషం.

Tags:    

Similar News