ఆయన గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన కాంట్రాక్టర్. అంతే కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా ఆయన కు ఎలాంటి ఢోకా ఉండటం లేదు. ఏ రాష్ట్రం లో అయినా అదే పరిస్థితి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఆ బడా కాంట్రాక్టర్ దగ్గర కు వెళ్లి తమకు ఇంకా ఇవ్వాల్సిన మొత్తం చాలా ఉంది...త్వరగా సెటిల్ చేయమని కోరగా..అందుకు ఆయన మాత్రం ఇప్పటికే చాలా ఇచ్చాం...ఇక ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏమి లేదు అని తేల్చిచెప్పినట్లు రాజకీయ, కాంట్రాక్టర్ల సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా ఇచ్చేది ఏమి లేదు అని తేల్చిచెప్పడంతో ఆ మాజీ మంత్రి ఏమి చేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
డిమాండ్ చేసి అడగటానికి అదేమీ అధికారికంగా ఇచ్చిన అప్పు కాదు. వాటికి రికార్డు లు ఏమి ఉండవు. ఇవన్నీ తెరవెనక సాగిన దందాలకు సంబంధించిన వ్యవహారం కావటంతో సదరు మాజీ మంత్రి సదరు కాంట్రాక్టర్ పై ఇప్పుడు ఫుల్ ఫైర్ అవుతున్నట్లు చెపుతున్నారు. అవినీతి డబ్బు విషయంలో కూడా ఆ మంత్రి అది తమ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని చెపుతున్నారు. అయితే ఈ మొత్తం డీల్స్ విషయంలో ఒకరి వ్యవహారాలు ఒకరి పూర్తి గా తెలిసి ఉండటంతో ఎవరూ ఏమి చేసేది ఉండదు అని...ఎవరికి వాళ్ళు ఛాన్స్ కోసం వేచిచూడటమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది