మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి కెసీఆర్ హుజూరాబాద్ వేదికగా దళిత బంధు స్కీమ్ ను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఒక్క ఈ నియోజకవర్గంలోనే 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకూ వ్యయం చేయనున్నారు. ఈ అంశంపై ఈటెల స్పందించారు. దళిత బంధు కింద పది లక్షల రూపాయలు రాష్ట్రంలోని దళితులు అందరికీ ఇవ్వాలన్నారు. జిల్లాలోని ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క హుజురాబాద్ నియోజక వర్గానికే కాదని, రాష్ట్రంలో అందరికి పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో తాను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు వస్తున్నాయన్నారు. దళితులకు ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి ఇస్తా అని కేసీఆర్ మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి లాక్కున్నడని దుయ్యబట్టారు. సిఎమ్ఓ కార్యాలయంలో దలితులు లేరన్నారు.