హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ లు పరామర్శించారు. ప్రస్తుతం ఈటెలకు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్స్ సలహా మేరకు ఈటెలను హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కటుంబ సభ్యులు తెలిపారు. గత పన్నెండు రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ తరుణంలోనే శుక్రవారం సాయంత్రం తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పలు రావటంతో అక్కడే ప్రాథమిక చికిత్స అందించి..తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు.