హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు!

Update: 2020-11-07 04:30 GMT

ఒకప్పుడు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేసేవి. ముఖ్యంగా పర్యాటకులు నగరం అందాన్ని వీక్షించేందుకు ఈ బస్సులు ఎక్కటానికి చాలా ఆసక్తి చూపేవారు. హైదరాబాద్ లో ఈ బస్సులు మిస్ అయ్యి దశాబ్దంపైనే అయింది. అయితే ఈ తరుణంలో తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ కెటీఆర్ శనివారం నాడు ఓ ట్వీట్ చేశారు. డబుల్ డెక్కర్ బస్సులతో తనకు ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయని...ఆబిడ్స్ లోని సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు వెళ్లేటప్పుడు ఈ బస్సులో వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నారు.

అయితే ఈ బస్సులు నగరం నుంచి ఎందుకు ఆపేశారో తెలియదని ట్వీట్ చేశారు. వీటిని తిరిగి తెచ్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా పరిశీలించమని కెటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ ఆజయ్ ను కోరారు. కెటీఆర్ హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటే ఆపేది ఎవరు?. సో..కెటీఆర్ కోరుకుంటున్నారు కనుక త్వరలోనే ఈ బస్సులు పరిమిత స్థాయిలో అయినా హైదరాబాద్ రోడ్లపై మళ్ళీ కన్పించవచ్చేమో..చూద్దాం.

Tags:    

Similar News