రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు

Update: 2020-12-17 16:44 GMT

తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశంపై విచారణ జరిగింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్‌ వివరాలు తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సాఫ్ట్‌ వేర్‌లో ఆధార్‌ కాలమ్‌ తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, పీటీఐఎన్‌ నిలిపేయాలని.. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్‌లు యధావిధిగా కొనసాగించాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగొద్దని.. వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని.. సాఫ్ట్‌ వేర్‌, మ్యానువల్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

Tags:    

Similar News