లిక్కర్ స్కాం ...అరెస్టులు అన్ని లెక్క ప్రకారమేనా?!

Update: 2023-02-11 06:08 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ..అరెస్టులు ఒక సారి ఫుల్ స్వింగ్ లో నడుస్తాయి. మళ్ళీ కొంత కాలం అంతా సైలెంట్ అవుతుంది. ఇది గత కొన్ని రోజులుగా సాగుతున్న తంతు ఇది. ఇప్పుడు మళ్ళీ వరస పెట్టి అరెస్టుల పర్వము సాగుతుంది. దీంతో ఇది అంతా పక్క ప్లాన్ ప్రకారం, వ్యూహం ప్రకారమే సాగిస్తున్నారు అనే చర్చ సాగుతోంది. కీలక వ్యక్తి అరెస్ట్ సమయంలో ఎలాంటి విమర్శలకు ఛాన్స్ లేకుండా చూసుకునేందుకు ఇలా చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేసు లో ఉన్న ఎవరి విషయంలో అయినా ఒకేలా వ్యవరిస్తాం అని చెప్పటానికే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఈ అరెస్ట్ లు ఉన్నాయనే చర్చ సాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని ఈ డీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సైతం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

                                 సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు చెపుతున్నారు. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.వరుస అరెస్ట్‌లు చూస్తుంటే ఇక మున్ముందు కీలక వ్యక్తుల అరెస్ట్‌లు ఉండబోతున్నాయనేది స్పష్టం. ఇటీవల ఇందులో ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరుకూడా చేర్చిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఇందులో సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరును పలు మార్లు ప్రస్తావించారు. ఫోన్లు నాశనం చేసి ఆధారాలు లేకుండా చేసిన విషయంలో కూడా ఎమ్మెల్సీ కవిత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఢిల్లీ లోని స్టార్ హోటల్ లో సౌత్ గ్రూప్ తరపున జరిగిన సమావేశాల్లో ఆమె నేరుగా పాల్గొన్నట్లు తాజాగా కోర్ట్ కు సపర్పించిన నివేదికలో ప్రస్తావించారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో..ఎవరిని అరెస్ట్ చేస్తారో అన్న టెన్షన్ నేతల్లో ఉంది.

Tags:    

Similar News