కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికకు సమాయత్తం అవుతోంది. సీనియర్ నేతలను ఈ ఎన్నిక కోసం బరిలోకి దింపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయటంతో సరైన అభ్యర్ధి వేటలో పడింది. ఇప్పుడే తమ అభ్యర్ధి ఎవరో చెప్పం అని..అయితే ఖచ్చితంగా బలమైన అభ్యర్ధే బరిలో ఉంటాడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.
ఈ ఉప ఎన్నిక కోసం హుజురాబాద్ అసెంబ్లీ బాధ్యతలను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. అదే సమయంలో ... వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి బుధవారం నాడు ప్రకటన విడుదల చేశారు.
వీణవంక - ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్
జమ్మికుంట - విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
జమ్మికుంట మున్సిపాలిటి - సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య
హుజురాబాద్ - తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హుజురాబాద్ మున్సిపాలిటీ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు
ఇల్లందకుంట - నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కమలాపూర్ - కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య