ఒకప్పటి కెసిఆర్ నినాదం స్వరాష్ట్రం..స్వయంపాలన. ఇప్పుడు అది నెరవేరింది. స్వయంపాలన కాస్త ఫార్మ్ హౌస్..ప్రగతి భవన్ పాలనా గా మారిపోయింది. బహుశా దేశంలో ఇంత సుదీర్ఘ కాలం సెక్రటేరియట్ కు రాకుండా పాలించిన సీఎం కెసిఆర్ ఒక్కరేనేమో. చివరకు కాబినెట్ సమావేశాలు కూడా ప్రగతి భవన్ కు పరిమితం అయినా విషయం తెలిసిందే. టీ ఆర్ ఎస్ కాస్త ఇప్పుడు బీ ఆర్ ఎస్ గా మారబోతుంది. ఈ తరుణంలో సి ఎం కెసిఆర్ ఢిల్లీ లో వారం రోజులుగా మకాం వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లో సీఎం కెసిఆర్ ఏమి చెస్తున్నారు అన్న విషయంలో అంతా క్లూ లెస్ గానే ఉన్నారు. ఇప్పుడు అకస్మాతుగా సీఎం నుంచి సీస్ తో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులకు పిలుపు రావటం వారంతా ఢిల్లీ పయనం అయ్యారు. ఢిల్లీ లోనే కెసిఆర్ పలు అంశాలపై రివ్యూ చేసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. నిజం గా సీస్ తో పాటు కొంత మంది అధికారులను హడావిడిగా ఢిల్లీ కి పిలిపించాల్సిన అవసరం ఏముంది..దీని వెనక అసలు కథ ఏందీ అన్న చర్చ సాగుతుంది అధికారుల్లో.
ఎంతటి కీలక అంశం అయినా ఇప్పుడు వీడియో కాల్స్...వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చాలా మంది పనులు కానిచ్చేస్తున్నారు. అలాంటిది ఉన్నతాధికారులను ఢిల్లీ పిలిచి సమావేశం పెట్టడం అంటే ఇప్పుడు తెలంగాణ పాలనా ఢిల్లీ నుంచి సాగుతున్నట్లు ఉంది అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కెసిఆర్ ఢిల్లీ వెళ్లి వారం దాటింది. మరి కొన్ని రోజులు అయన అక్కడే ఉంటారని చెపుతున్నారు. ఢిల్లీ లో సీఎం కెసిఆర్ వెంట అయన కూతురు, ఎంమ్మెల్సీ కవిత కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ;పరిణామాలపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి .కెసిఆర్ ఢిల్లీ జాతీయ పార్టీ పనులు అంటే బీ ఆర్ ఎస్ కోసం ఉన్నారా లేక రాష్ట్ర అవసరాలా..ఇతర బయటకు చెప్పలేని అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి.#