బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి

Update: 2021-06-22 11:38 GMT

ముఖ్య‌మంత్రి కెసీఆర్ మంగ‌ళ‌వారం నాడు యాదాద్రి భువ‌నగిరి జిల్లాలో తాను ద‌త్త‌త తీసుకున్న వాసాల‌మ‌ర్రి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ గ్రామం రాష్ట్రంలోని ప‌లు ఊర్ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. అందరూ కలిసి శ్రమిస్తే ఏదైనా సాధ్యం అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. అంకాపూర్‌కు వెళ్లొచ్చి చూశారు కదా.. అక్కడ బంగారు భూమి లేదు. అంకాపూర్‌లో బిల్డింగ్‌లు ఎలా ఉన్నాయ్‌. అక్కడ ఉన్నది రైతులే.. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీనే సుప్రీంకోర్టు. సర్పంచ్ తప్పు చేసినా ఆ గ్రామ కమిటీ ఫైన్ వేస్తుంది. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీసులు వెళ్లాల్సిన అవసరం రాలేదు.గ్రామ రూపురేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కావొద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు.

వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు అయినా వస్తానని వ్యాఖ్యానించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు. ఊరిలో పోలీసు కేసులు ఉండకుండా చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు. ఊరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండాలన్నారు. గ్రామస్తుల మధ్య ఐకమత్యం ఉండాలని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. కులాలు, మ‌తాల‌కు అతీతంగా అంద‌రూ క‌ల‌సి ముందుకు సాగాల‌న్నారు.

Tags:    

Similar News