అమిత్ షాను క‌ల‌వ‌గానే కెసీఆర్ యూ ట‌ర్న్

Update: 2021-11-23 13:51 GMT

తెలంగాణ సీఎం కెసీఆర్ ఎప్పుడు యుద్ధం అంటారో..ఎప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంటారో తెలియ‌దు అని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్యానించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందన్నారు.రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తా అంటున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరన్నారు.

ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో అమ‌రులైఐన వారికి సాయం చేస్తామ‌ని చెప్పి ఏడేళ్లు దాటినా ఇంత వ‌ర‌కూ వారికి సాయం అంద‌లేద‌న్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఏక‌గ్రీవంగా తీర్మానం చేశామ‌ని గుర్తుచేశారు. ఏడున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి నీటి వాటాల గురించి తేల్చ‌కుండా కెసీఆర్ ఏమి చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఎన్ని అసెంబ్లీ స‌మావేశాలు అయిపోయినా డీపీఆర్ లు మాత్రం ఇవ్వ‌ర‌ని, ఏపీ, తెలంగాణ మధ్య జ‌రుగుతున్న అంశాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Tags:    

Similar News