అయితే నిజంగా అనుమతి ఇవ్వదలచుకోకపోతే ముందస్తు సమాచారం ఇస్తే ఎక్కడి వారు అక్కడ ఆగిపోయే వారు. కానీ ఈ సినిమాలో అమితాబచ్చన్, రణబీర్ కపూర్, అలియాభట్, నాగార్జున తదితరులు నటించారు. చిత్ర యూనిట్ హైదరబాద్ చేరుకుంది. కానీ చివరి నిమిషంలో వినాయక చవితి ఉత్సవాలను కారణంగా చూపుతూ ఈవెంట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే దీని వెనక ఉత్సవాల కారణం కంటే రాజకీయ కారణాలే ఉన్నట్లు టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. మునావర్ ఫారుఖీ ఈవెంట్ ను వేల మంది పోలీసుల పహారాలో నిర్వహించిన సర్కారు..ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమానికి అనుమతి నిరాకరించటం అంటే ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఇది సాగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ను ముఖ్యఅతిధిగా అహ్వానించారు. చివరి నిమిషంలో ఈవెంట్ రద్దు కావటంతో చిత్ర యూనిట్ కు షాక్ తగిలినట్లు అయింది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు బిజెపి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే నామినేటెడ్ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు..ఆయన ఆర్ఎస్ఎస్ కోసం ఓ సినిమా కథను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవి అన్నీ సీఎం కెసీఆర్ కోపానికి కారణం అయి ఉంటాయని భావిస్తున్నారు.