కెసీఆర్ మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

Update: 2021-08-30 07:47 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. ఆయ‌న సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. సెప్టెంబర్ 2, 2021 మధ్యాహ్నం 12:30 గం. ల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమిపూజ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ తో పాటు భూమిపూజ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన‌నున్నారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించిన విష‌యం తెలిసిందే. పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ కార్య‌క్ర‌మం అనంత‌రం సెప్టెంబర్ 3, 2021 మధ్యాహ్నం కెసీఆర్ తిరిగి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. అయితే ఈ స‌మ‌యంలో ఢిల్లీలో సీఎం కెసీఆర్ ఎవ‌రితో అయినా భేటీలు నిర్వ‌హిస్తారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.టీఆర్ ఎస్ కార్యాల‌య భ‌వ‌నం కోసం కేటాయించిన స్థ‌లాన్ని ఇప్ప‌టికే రెడీ చేసి పెట్టారు. పైన చిత్రంలో ఉన్న‌ది అదే ఫోటో.

Tags:    

Similar News