కిష‌న్ రెడ్డికి ప‌దోన్న‌తి

Update: 2021-07-07 15:23 GMT

కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌లువురు సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న ప‌లికి కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన విష‌యానికి వ‌స్తే ఏపీకి అస‌లు మంత్రివ‌ర్గంలో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ విష‌యానికి వ‌స్తే ప్ర‌మోష‌న్ దొరికిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి ఉన్న జి. కిష‌న్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప‌ద‌న్నోతి పొందారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది స‌హాయ మంత్రుల‌తో రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు, మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా కేబినెట్‌ విస్తరణ చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌-2.0ను తొలిసారి విస్తరించారు. కొత్త కేబినెట్‌ విస్తరణతో ప్రస్తుత కేంద్ర మంత్రుల సంఖ్య 77కి చేరింది. విస్తరణ అనంతరం మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరింది. మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో ముందు మ‌హారాష్ట్ర‌కు చెందిన నారాయ‌ణ్ రాణే ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా..చివ‌రిగా నిషీత్ ప్రామాణిక్ ప్ర‌మాణం చేశారు. కొత్త‌, పాత మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు గురువారం నాడు ఉండే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News