అందులో వచ్చే ఎన్నికల్లో బిఆర్ ఎస్ కు ఎన్ని వస్తాయి...ఈ సీట్ల ఆధారంగా కేంద్రంలో కెసిఆర్ కి ఎంత ప్రాముఖ్యత లభిస్తుంది అన్నది కీలక అంశంగా చెపుతున్నారు. ఏది అయినా కూడా రాజకీయాల్లో నంబర్లే ముఖ్యం అన్నది తెలిసిందే. బిఆర్ఎస్ తో పొత్తుకు కుమార స్వామి ఒక్కరే రెడీ గా ఉన్నారు. మరి యూపీలో అఖిలేష్ యాదవ్ పొత్తు పెట్టుకుంటారా..అక్కడ ఏమి బలం ఉంది అని బిఆర్ఎస్ కు సీట్లు ఇస్తారు..కేవలం ఒక తెలంగాణ మోడల్ అని చెప్పగానే ఇతర రాష్ట్రాల్లో ఓట్ల వర్షం కురుస్తుందా అన్నవి ఇప్పుడు కీలక ప్రశ్నలు గా మారుతున్నాయి. ఢిల్లీ లోని ఆప్ కూడా ప్రస్తుతం కెసిఆర్ తో కలిసి ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు. మరో వైపు పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీ లు అన్ని ఇప్పటికి ఎవరి లైన్ ప్రకారం వాళ్ళు ముందుకు సాగుతున్నారు. మరి కెసిఆర్ తో కలిసి వచ్చేది ఎవరు. దేశం అంతటా ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రమే. అలాంటిది కెసిఆర్ పెట్టిన బిఆర్ఎస్ కు ఆదరణ దక్కటం అంటే అది జరగని పని అని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారనే ..మరో కోణంలోనో బిఆర్ఎస్ కు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలోని కాస్త అభ్యర్థులు దొరుకుతారని చెపుతున్నారు. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి అంటే చూడాల్సిందే.