నగరానికి మరో కీలక సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన బాష్ (Bosch) హైదరాబాద్ లో తన గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్, పరిశోధనా, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసింది. బాష్ జర్మనీకి చెందిన ఎంఎన్ సీ కంపెనీ. ఈ ప్రతిపాదిత యూనిట్ ద్వారా మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి కెటీఆర్ ట్వీట్ చేశారు. బాష్ సంస్థ మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోం అప్లయెన్స్ విభాగంలో వరల్డ్ లీడర్‌గా ఉంది. ప్రతిపాదిత యూనిట్ ఏర్పాటు అంశంపై బాష్ ప్రతినిధులు మంగళవారం నాడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిసి సంప్రదింపులు జరిపారు. బాష్ సంస్థ అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీలో సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025-26 నాటికి ఈ బోస్ సెంటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది.