బిజెపి దిగ‌జారుడు రాజ‌కీయాలు

Update: 2021-10-28 08:06 GMT

తెలంగాణ బిజెపి థ‌ర్డ్ క్లాస్ రాజ‌కీయాలు చేస్తోంద‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత‌గా దిగ‌జారాలా అని మండిప‌డ్డారు. దాన్యం కొంటామ‌ని కేంద్రం ప్ర‌క‌టించే వ‌ర‌కూ బండి సంజ‌య్ దీక్ష చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆయ‌నకు ద‌మ్ముంటే సాయంత్రం ఐదు గంట‌ల లోపు తెలంగాణ‌లో వేసే ప్ర‌తి పంటా కొంటామ‌ని కేంద్రం నుంచి ఉత్త‌ర్వులు తేవాల‌ని స‌వాల్ చేశారు. అది చేత‌కాక‌పోతే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.

'రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామ‌ని తెలిపా. వారి కోసం​ రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు ఇస్తున్నాం. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యాన్ని సేకరిస్తున్నాం. వరి సాగు, వరి కొనుగోలు చేయటం లేదని బండి సంజయ్ దీక్షలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రచారం చేయాలని ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనలేమని, బాయిల్డ్ రైస్ కొనలేమని' కేంద్ర మంత్రి చెప్పారు. ఈ విష‌యాలు అన్నీ హుజూరాబాద్ ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. 

Tags:    

Similar News