భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ మరింత బలోపేతానికి, పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకుంటుంది. బిజెపిలో ప్రతిభావంతులైన నాయకులకు, సమర్థవంతమైన పనితీరుకు పట్టం కడుతూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాధ్యతలు అప్పగిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు, వ్యాపారవేత్త సుధాకర్ గాందేని మల్కాజ్‌గిరి పార్లమెంట్ బిజెపి కో కన్వీనర్ గా నియమించారు. ఈ మేరకు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు శనివారం నాడు నియామక లేఖ మీడియాకు విడుదల చేశారు.
ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, సుధాకర్ గాందే సేవలు బిజెపి గెలుపుకు నాంది కావాలని ఆయన ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి మల్కాజ్గిరి పార్లమెంటు కో కన్వీనర్ బాధ్యత అప్పగించిన బిజెపి నాయకత్వానికి సుధాకర్ గాందే కృతజ్ఞతలు తెలిపారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగరేసి ప్రధాని మోడీకి బహుమతిగా ఇవ్వడానికి బిజెపి శ్రేణులంతా సిద్ధంగా ఉన్నాయని అన్నారు.