ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రఘునందన్ రావు

Update: 2020-11-18 09:31 GMT

దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం దక్కించుకున్న బిజెపి ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు బుధవారం నాడు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మరో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పాల్గొన్నారు. మరో వైపు గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. 

Tags:    

Similar News