గత ఆర్ధిక సంవత్సరం లెక్కలు చూస్తే ఈ మొత్తం పది వేల కోట్ల రూపాయలు కూడా దాటలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఓ వైపు కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల ఆశించిన విధంగా రాక..మరో వైపు అప్పులు చేసుకునే అవకాశం లేకపోవటంతో ఈ సారి బడ్జెట్ లోనే భారీ కోతలు పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో సొంత స్థలం ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మూడు లక్షల రూసాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఈ పరిస్థితుల్లో ముందుకు సాగటం అనుమానమే అంటున్నాయి అధికార వర్గాలు. అప్పుల విషయంలో కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం బడ్జెట్ లో భారీ కోత పడుతుందని..ఇది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.