ముర‌ళీముకుంద్ కు ఇక ఇంటిదారే

Update: 2021-09-21 14:57 GMT

ముర‌ళీగానం ఇక మూగ‌బోవ‌ట‌మే. ఆయ‌న‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక మిగిలింది ఇంటిదారే. ఇదీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ కార్య‌ద‌ర్శి ముర‌ళీ ముకుంద్ కు ఎదురైన ప‌రిస్థితి. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీగా మురళీ ముకుంద్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్టే విధిస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి అమర్‌నాథ్‌ గౌడ్ ఇచ్చిన ఆర్డర్స్‌ని... జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ కూడిన బెంచ్ ప‌క్క‌న పెట్టెసింది. సింగిల్ జడ్జి ఆర్డర్స్‌ను సవాలు చేస్తూ సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ లెటర్ పేటెంట్ అప్పీల్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం... ఈ సందర్భంగా పలు కీల‌క వ్యాఖ్యలు చేసింది. కంటెంప్ట్ పిటిషన్‌లో తన ముందున్నదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలిగానీ దాని కాన్సిక్వెన్స్ రిలీఫ్‌లు ఇవ్వొద్దని పేర్కొంది.

డబుల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్‌ని మీరు పరిగణనలోకి తీసుకోరా? మేము సస్పెండ్ చేసిన ఆర్డరు మీరు అనుసరించరా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 18-08-2021న జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ... సెక్రెటరీ అధికారాలు తీసేసింది. దాని రిట్ అప్పీల్ నెంబర్ 458 ఆఫ్ 2021 సస్పెండ్ చేసిందీ అంటే... ఆ రోజు నుంచి దాన్ని కొట్టివేసినట్టు. సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఆ ఆర్డర్ చెల్లదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు దానిమీద ఎలాంటి కంటెంప్ట్‌లుగానీ, కాన్‌సీక్వెన్సెస్ రిలీఫ్‌లుగానీ చెల్లవని ధర్మాసనం చెప్పింది. ధర్మాసనం తాజా ఆర్డర్స్ ప్రకారం... ఇక మురళీ ముకుంద్ సెక్రెటరీగా కొనసాగలేరు. దీంతో ఆయ‌న ప‌ద‌వి పోయింది. అదే స‌మ‌యంలో సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్‌పై మురళీ ముకుంద్‌ వేసిన కంటెంప్ట్ పిటీషన్‌ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

Tags:    

Similar News