కాంగ్రెస్ ని చంపి..బీజేపీ ని పెంచాలని చూసిన కోమటిరెడ్డి బ్రదర్స్!

Update: 2022-11-07 05:00 GMT

మేము ఉంటేనే పార్టీ. మేము పార్టీ కి బలం కానీ..మాకు పార్టీ బలం కాదు. మేము ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ దే గెలుపు అన్న చందంగా వ్యవహరించారు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి, వెంకట రెడ్డి. తెలంగాణ లో టిఆర్ఎస్ ను ఓడించే శక్తి ఒక్క బీజేపీ కే ఉంది అంటూ కాంగ్రెస్ లో ఉంటూ మరి మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి . ఇప్పుడు ఆయనే స్వయంగా టిఆర్ఎస్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలుచున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఫార్ములా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ స్టార్ ప్రచార కర్త గా ఉన్న వెంకట రెడ్డి అన్ని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్లారు..వచ్చారు. విదేశీ పర్యటనలోనే తన తమ్ముడు గెలుస్తాడు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాజకీయంగా బ్రదర్స్ వ్యూహం దెబ్బ కొట్టింది. మరి ఇప్పుడు వెంకట రెడ్డి ఏమి చేస్తారు అన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేస్తుందా..వేచి చూస్తుందా అన్నది తేలాల్సి ఉంది.

మొత్తానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తామే ఏ పార్టీ కి అయినా కీలకం అన్న చందంగా వ్యవహరించిన బ్రదర్స్ కు ఇది భారీ దెబ్బగా భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే మాత్రం వీళ్లకు ఇంకా డిమాండ్ పెరిగి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. తాజా పరిణామాలు బ్రదర్స్ ఇద్దరికి ఇబ్బందులు సృష్టిస్తాయని చెపుతున్నారు. ఎందుకు అంటే మరో ఏడాదిలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఇతర నేతలతో పోలిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనంలో ఉన్న నేత అనడంలో సందేహాఁ లేదు. మరి ఇలాంటి వారు బీజేపీ దగ్గర ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు అన్నది కీలకం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆర్ధికంగా బాగా ఖర్చుపెట్టే పరిస్థితిలో ఉన్న కూడా విజయం సాదించలేకపోయారు. అయితే బ్రదర్స్ ఇద్దరూ ఏదో అనుకుంటే ఏదో జరిగింది అన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలని చూసి వీళ్లిద్దరు దెబ్బ తిన్నారు. తాజా పరిణామాలతో అంత ఈజీ ఎవరు బీజేపీ లో చేరతాని కూడా ఆసక్తి చూపించారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Tags:    

Similar News