అది కూడా హై కోర్టు ఆదేశాలతో

Update: 2024-09-18 10:19 GMT

బిఆర్ఎస్ ఆఫీస్ పైకి బుల్డోజర్ వెళ్లనుంది. అది కూడా హై కోర్టు ఆదేశాలతో. ఎవరైనా..ఎక్కడైనా ముందు అనుమతి తీసుకుని భవనం నిర్మించుకుంటారు. ఇది పద్ధతి. కానీ దగ్గర దగ్గర పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ మాత్రం ఇవేమి పట్టించుకోలేదు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశిస్తే ..అప్పుడు ఆగమేఘాల మీద కోర్టు కు వెళ్లి తమ భవనానికి మున్సిపల్ శాఖ అనుమతులు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్టు కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ..కట్టిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారు అని ప్రశ్నించింది. అంతే కాదు..పదిహేను రోజుల్లో ఈ బిల్డింగ్ ను కూల్చేయాలని ఆదేశించింది.

                                   ఇది ఇప్పుడు బిఆర్ఎస్ కు పెద్ద షాక్ గా మారింది అనే చెప్పాలి. ఈ వ్యవహారం అంతా నల్గొండ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు సంబంధించింది. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ ఆఫీస్ భవనం అక్రమ నిర్మాణం అని..దీన్ని కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే బిఆర్ఎస్ కోర్టు ను ఆశ్రయించింది. ఇప్పుడు కోర్టు కూడా అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను పడగొట్టమని ఆదేశించింది. అంతే కాదు..లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

Tags:    

Similar News