మునుగోడు ఉప ఎన్నిక ను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటుందా?. ఇదే ఇప్పడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. బీజేపీ నుంచి బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారటం ఒక మైనస్ అయితే..కాంట్రాక్టు కోసమే పార్టీ మారినట్లు భారీగా ప్రచారం జరగటం ఆయనకు ఎంతో కొంత నష్టం చేసే అంశం. నిన్న మొన్నటి వరకు అయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి బారీ కాంట్రాక్టు పొంది పార్టీ మారారు. ఇటు తెరాస తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయంలో కోమటిరెడ్డి ని టార్గెట్ చేసింది. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అధికార తెరాస కి కూడా చాలా మైనస్ లు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన కె ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో సరిగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదేనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు అధికార తెరాస పై వ్యతిరేకత ఆయనకు మైనస్ గా మారబోతుంది. ఈ భయంతోనే సీఎం కెసిఆర్ ఏకంగా వంద మందిని అక్కడ మోహరింప చేసారు.
ఇది చూసే ప్రజలు కూడా ఒక ఎన్నికకు ఇంత మంది అవసరమా అని కామెంట్ చేస్తూన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న పాల్వాయి స్రవంతి కి అటు బీజేపీ, ఇటు అధికార తెరాస వాళ్ళతో పోలిస్తే మైనస్ లు పెద్దగా ఏమి లేవనే చెప్పొచ్చు. ప్రధాన సమస్య బీజేపీ, తెరాస ల తో సమానముగా డబ్బు ఆ పార్టీ పెట్టే స్థితిలో లేదు అని చెప్పొచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సయోధ్య అన్నది ఒక ప్రధాన సమస్య. వాస్తవానికి తెరాస, బీజేపీ వాళ్ళతో పోలిస్తే పాల్వాయి స్రవంతి కి మైనస్ లు ఏమి లేవనే చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు క్యాష్ చేసుకుంటోందో వేచిచూడాలి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయితే నియోజక వర్గంలో ఫుల్ స్పీడ్ చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చాలా చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక రకంగా సెమి ఫైనల్ వంటిది. మరి ఏ పార్టీ ఇందులో విజయం సాధిస్తుందో వేచిచూడాల్సిందే.