తెలంగాణలో బ్యాంకుల పనివేళలు కుదింపు

Update: 2021-05-12 12:37 GMT

కరోనా కారణంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్న రంగాల్లో బ్యాంకింగ్ రంగం కూడా ఒకటి. తొలి దశతోపాటు రెండవ దశలోనూ బ్యాంకుల సిబ్బంది చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో బ్యాంకు పనివేళలను గణనీయంగా తగ్గించారు.

గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బీఐతోపాటు ఇతర బ్యాంకుల్లోనూ ఇదే సమయాలు అమలు కానున్నాయి.

Tags:    

Similar News