అసైన్ మెంట్ భూమి ఉన్నది నిజమే..కలెక్టర్

Update: 2021-05-01 07:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై శనివారం ఉదయం నుంచే ఆగమేఘాలపై విచారణ ప్రారంభం అయింది. ఈటెలకు చెందిన హ్యాచరీస్ లో అసైన్ మెంట్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం ఉదయం నుంచే మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ అధికారులు విచారణ ప్రారంభించారు.

మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు అడిగి తీసుకున్నారు విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్‌ పాల్గొన్నారు. అచ్చంపేటలో తుప్రాన్‌ ఆర్డీవో రాంప్రకాశ్‌ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటెలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్‌ సర్వే కొనసాగుతోంది. దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్‌ భూముల్లోనూ అధికారులు డిజిటల్‌ సర్వే చేస్తున్నారు.

Tags:    

Similar News