బండారు దత్తాత్రేయ. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు నగరంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆయన ఆదివారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని జలవిహార్ లో సాగిన అలయ్ బలయ్ కు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పలువురు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఈ ఫోటోపైనే పడింది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్, సీఎం కెసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇటీవలే బండి సంజయ్ పై కవిత తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే కెసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సంజయ్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కవిత..మరి పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికలో మమతా బెనర్జీని ఓడించేందుకు ప్రయత్నించిన బిజెపి విఫలమైంది కదా..మరి దానికి మోడీ రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాలో కన్పించేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే నేతలు అందరూ విభేదాలను పక్కన పెట్టి కలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారని, ఇదే నిజమైన అలయ్..బలయ్ అని వ్యాఖ్యానిస్తున్నారు.