సిద్దార్థ లూథ్రా కు 1 .15 కోట్లు చెల్లింపు

Update: 2025-11-24 13:02 GMT

సిద్ధార్థ్ లూథ్రా. పరిచయం అక్కరలేని పేరు. ఎందుకంటే ఆయన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్ట్ లో సీనియర్ న్యాయవాది. పలు కీలక కేసుల్లో ఆయన హాజరు అవుతుంటారు. ఇప్పుడు ఈయన విషయాలు అన్నీ మనకు ఎందుకు అంటారా?. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధార్థ్ లూథ్రా కు ఒక్కో అప్పీయరెన్సు కు అంటే ఒక రోజు ప్రభుత్వం తరపున కోర్ట్ కు హాజరు అయినందుకు రోజుకు పది లక్షల రూపాయలు లెక్కన చెల్లించింది. ఎన్ని రోజులు హాజరు అయితే అన్ని పది లక్షల రూపాయలు అన్న మాట. ఈ మేరకు సర్కారు సోమవారం నాడు రెండు జీవో లు జారీ చేసింది. వీటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున హై కోర్ట్ లో కేసులు వాదించినందుకు ఆయనకు ప్రభుత్వం ఈ రెండు జీవో ల మొత్తం కలుపుకుని కోటి పదిహేను లక్షల రూపాయలు చెల్లించింది. జీవో 1768 ద్వారా 93 .50 లక్షల రూపాయలు...జీవో 1767 ద్వారా 22 లక్షల రూపాయలు చెల్లించారు.

                                      రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ తో పాటు ఎంతో మంది సీనియర్ లాయర్లు ఉన్నా కూడా ప్రభుత్వం రోజుకు పది లక్షల రూపాయలు చెల్లించి మరీ ఇంత ఖరీదు అయిన లాయర్లను ఎందుకు ఎంగేజ్ చేసుకుందో ఆశ్చర్యంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంపై కూడా ఇలాంటి విమర్శలు చాలానే వచ్చాయి. ఇది అంతా చూస్తుంటే ఎవరు అధికారంలో ఉన్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా ప్రభుత్వం తరపున వాళ్ళు ఎంత కోరితే అంత మొత్తం చెల్లించి తర్వాత రాజకీయ నాయకులు ఎప్పుడైనా తమ వ్యక్తిగత కేసులు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి వారి నుంచి సేవలు పొందుతారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

Tags:    

Similar News