153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. వైసీపీ మంత్రులు, పార్టీ నాయకులు ఎంత ఎటాక్ చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను తెచ్చారని పవన్ ఆరోపించారు. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? అని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదన్నారు. ఈ డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోందని తెలిపారు. వాలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారని, ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకి తెలుసన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా వాళ్లకి తెలుస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉండవచ్చు.. సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా? అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు.