పదవీ కాలం మూడేళ్లు

Update: 2025-12-23 12:30 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కు కేంద్రంలో కీలక పదవి దక్కింది. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏసిజె) గా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. కనకమేడల రవీంద్ర కుమార్ తో పాటు దవీందర్ పాల్ సింగ్ ను కూడా ఈ పోస్ట్ లో నియమించారు. మొత్తం కొత్తగా ఇద్దరికీని అదనపు సొలిసిటర్ జనరల్ పోస్టుల్లో నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీళ్ళు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

                                                       ఇది ఇలా ఉంటే కనకమేడల రవీంద్ర కుమార్ కు ఈ పదవి దక్కనున్నట్లు తెలుగు గేట్ వే. కామ్ లో డిసెంబర్ 13 నే వార్త ప్రచురించటం జరిగింది. కేంద్రంలో ఈ పదవికి ఆయన పేరును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫారసు చేసినట్లు కూడా అందులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఆయన కు ఈ కీలక పదవి దక్కింది. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మంత్రి నారా లోకేష్ తో కనకమేడలకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందుకు ఉపకరించాయి అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

ఓల్డ్ లింక్ ..

https://telugugateway.com/andhra-pradesh-telugu/tdp-ex-mp-ravindra-kumar-in-race-for-asg-post-1547004

Tags:    

Similar News