సభలో టీడీపీ కుట్ర

Update: 2020-12-01 06:30 GMT

శాసనసభలో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాను చెప్పే అంశం ప్రజలకు చేరవద్దనే ఉద్దేశంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద గొడవ చేస్తున్నారని విమర్శించారు. అంతే కాదు..పోడియం దగ్గర కూడా టీడీపీలో ఉన్న దళిత ఎమ్మెల్యేను ముందు పెట్టారని..ఇది అంతా కుట్ర ప్రకారమే చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థంకావడంలేదని అన్నారు. శాసనసభలో సీఎం ప్రంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు.

తాను ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతాం. ఆ విధమైన నమ్మకం ప్రజల్లో ఎప్పుడో కలిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగించాం. దటీజ్‌ జగన్‌. చంద్రబాబు ఏదైనా చెప్పాడు అంటే అది చేయడు అనేది క్రిడిబులిటి. మనం చేసే పనుల వళ్ల మనకు క్రిడిబులిటి వస్తుంది. చంద్రబాబు హయాంలో ఇన్సూరెన్స్‌ కట్టాలంటే రైతులు భయపడేవారు. మేం 59 లక్షల 70వేల మంది రైతులను ఇన్సూరెన్స్‌ ప్రీమియం పరిధిలోకి తీసుకొచ్చాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంది. 2019లో రైతులు, రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.1030 కోట్లు చెల్లించాం. డిసెంబర్‌ 15న రూ.1227 కోట్లు బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం' అని అన్నారు.

Tags:    

Similar News