తెలుగు దేశం పార్టీ గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూసి ఉండదు. అది ఎలా అంటే సొంత పార్టీ అభిమానులు.. సోషల్ మీడియా సైన్యం స్వయంగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తుండటం. అధికారంలో వచ్చిన తర్వాత నాయకత్వం చేస్తున్న పనులు వాళ్లకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ముఖ్యంగా అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ కేవలం తమ వల్ల మాత్రమే , తమ కష్టంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు పదే పదే చేస్తున్న ప్రకటనలు అటు పార్టీ నాయకులతో పాటు క్యాడర్ కు కూడా ఏ మాత్రం రుచించటం లేదు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుపులో 50 శాతంపైగా పాత్ర పోషించింది అంటే అది జగన్ పై...అతని పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే. తర్వాత అంశాలు చంద్రబాబు అరెస్ట్ , అనంతర వ్యూహాలు...పవన్ కళ్యాణ్ మద్దతు వంటివి ఎన్నో కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..చంద్రబాబు ప్రకటనలు ఏ మాత్రం రుచించని టీడీపీ అభిమాని రాసిన పోస్ట్ అటు సోషల్ మీడియా లో ఇటు వాట్సాప్ లో వైరల్ అవుతోంది. అదే ఇది.
"సొంత కక్షలని #పార్టీఖాతా లో వేస్తాను అంటే కుదరదు!" CBN
..వారం కిందట ఈ స్టేట్మెంట్ ని పేపర్లో చదివాక నాకైతే నోట మాట రాలేదు!!
..ఈరోజుల్లో " పార్టీ కక్షలు, సొంత కక్షలు "అని సొసైటీ లో వేరే వేరే వుంటున్నా యా!?ఒకడు ఒక పార్టీ లో ఆక్టివ్ గా పని చేస్తున్నాడు, సభ్యత్వం వుంది,జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యగల డు అంటే వాడు ఆటోమేటిక్ గా ప్రత్యర్థి పార్టీ కి,అందులో వుండే నాయకులకి టార్గెట్ అయితీరుతాడు కదా!?
..ప్రత్యర్థి పార్టీ అధికారంలో వుంటే అతన్ని కార్నర్ చెయ్యడానికి పోలీస్ కేసుల్లో ఇరికించడం,పొలం, స్థలాల ఇష్యూల్లో ఇబ్బంది పెట్టడం,ప్రభుత్వ పథకాలు అర్హత వున్నా రానీకుండ తొక్కిపెట్టడం,అతని కుటుంబ సభ్యులని కూడా హరాస్ చెయ్యడం ఈనాటి రాజకీయంఅయిపోయింది!
..జగన్, అతని పార్టీ రాజకీయం దేశంలో అత్యంత ప్రమాదకరమైన అణిచివేత ధోరణి,కక్షా పూరితమైన చర్యలతో కూడుకున్నది. కారణం అతని ఫ్యాక్షన్ డీఎన్ఏ. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడంతో మొదలై కిడ్నాప్స్,బ్లాక్మెయిల్స్,వెంటాడి,వేధించడం,బెదిరింపులు,హత్యయత్నా లు కలగలసి వుంటాయి. అధికారం తో వచ్చే ఆర్థికలాభం వారి రాజకీయ లక్ష్యం.పెంపుడు కుక్కల్లా పెంచిన తన వర్గ సంరక్షణకు బొమికలు విసిరి మాంసం లో సింహభాగం మింగడం వాడి అలవాటు! పోలీస్ లని మేనేజ్ చేసి బాధితుల మీదే తిరిగి కేస్ పెట్టించడం, SC,ST కేసులు ప్రత్యర్థి వర్గం మీద పెట్టించి బెయిల్ రాకుండా చెయ్యడం వాళ్ళ మోడస్ ఆపర్యాండి!!
..ఇలాంటి వాతావరణంలో కొన్ని వేల మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలకి తెగించి,పోలీస్ కేసులకు, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ లకి ఎదురొడ్డి,ధన,మాన, ప్రాణాలనీ పణంగా పెట్టీ , పోలింగ్ బూతుల బయట నిలబడి ప్రత్యర్థుల దౌర్జన్యాలను అడ్డుకుని, ఓటర్లని బూత్ ల వరకు తీసుకువచ్చి ఓట్లు వేయిస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది అని మరిచిపోయి ఇలాంటి డొల్ల స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి!? కనీసం నా మాటలు ఎవరి #నైతికస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి అన్న సోయి వుందా!?అధికార మదాంధత నెత్తికి ఎక్కి వచ్చిన ప్రేలాపనల్లా వున్నాయి అవి!?
..పార్టీ కి దూరంగా వుంటే , సానుభూతిపరుడిగా వుండి తన ఓటు మాత్రమే వేసే స్టాండ్ తీసుకుంటే ఎవరికీ అయినా ఇన్ని కష్టాలు వస్తాయా!?కక్ష లు మొదలవుతయా!?
.మొన్నటి దాకా వైసీపీ లో వుండి అధికారం అనుభవించి ఎలక్షన్ ముందు,గెలిచిన తర్వాత టీడీపీ లోకి వచ్చిన వాళ్ళకి ముందు ఎంఎల్ఏ టికెట్ , తర్వాత మంత్రి పదవులు ఇచ్చి కార్యకర్తల నెత్తిన ఎక్కించి,వాళ్ళు టీడీపీ వాళ్ళకి పలకరింపులు కూడా లేకుండా, వైసీపీ వాళ్ళకి పనులు చేస్తుంటే నిష్క్రియపరత్వంతో వున్న సిగ్గు ఎగ్గు లేని పార్టీ అధిష్టానాన్ని చూసి నిఖార్సైన కార్యకర్త ఏడవలేక నవ్వుకుంటు న్నాడు!!భరిస్తున్నాడు! తప్పు చేసినవాడి సంగతి,తమని హరాస్ చేసిన వాళ్ళ సంగతి చూడమంటే ఏవో కబుర్లు చెబుతూ నెట్టుకొస్తున్న వాళ్ళని చూసి లెక్కపెట్టు కుంటున్నారు తమ్ముళ్లు!! వాడొచ్చి మిజరబుల్ ట్రీట్మెంట్ మళ్ళీ ఇస్తే ఓదార్చాల్సింది కూడా ఈ తమ్ముళ్లే!మన చేతగాని తనంతో ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ పార్టీని చేష్టలుడిగి,జవసత్వాలు నశించిన పార్టీ లాగా నిర్వీర్యం చేస్తున్న చర్యలు కూడా మింగుడిబడటం లేదు తమ్ముళ్ళకి!!
..కానీ..
ఒక్కటి గుర్తుపెట్టుకోండి!
..జగన్ ని ఒళ్ళంతా నింపుకుని అతను తిట్టమంటే అతని తల్లిని, చెల్లిని కూడా అసహ్యంగా తిట్టే నిశాని,నిబ్బా,గొర్రె వైసీపీ కార్యకర్తలు లాంటి వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు.చదువుకుని,ఉద్యోగాలు చేసుకుంటూ,కనీస విచక్షణ,వివేకం వుండి, తమ పార్టీ రాజకీయం వల్ల సమాజం కి మంచి జరిగి, ఆంధ్ర రూపు రేఖలు మారి తమ పిల్లల భవిష్యత్ బాగుంటుంది అన్న ఆలోచనలతో,ఆశలతో పార్టీ కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనేవాళ్లు ఎక్కువ!
..పార్టీ నాశనం అవుతుంది అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ని కూడా కిందకి లాగింది వాళ్ళే! మిమ్మల్ని ఎక్కించినవాళ్లు కూడా వాళ్ళే!! మీరంతా ట్రస్టీ లే!శాశ్వతం కాదు!టర్మ్ అయిపోయినా,తప్పటడుగులు వేసినా,కీర్తి కాంక్ష కి లొంగినా దిగిపోవాల్సిందే!ఇక్కడ నాయకులు, అధినాయకుడు కూడా శాశ్వతం కాదు!!కార్యకర్త ఒక్కడే శాశ్వతం!వాడే సుప్రీం!వాడిని ఎంచే sanctity, వాడికి సుద్దులు చెప్పే అర్హత ఎవడికీ లేదు!!రాదు కూడా!!
కొత్తపల్లి శ్రీనివాస ప్రసాద్ (కె ఎస్ పీ)