జగన్ టార్గెట్ క్లియర్

Update: 2023-07-30 14:15 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు వర్సస్ రామోజీ గ్రూప్ సంస్థల ఫైట్ పీక్ కు చేరింది. నంబర్ వన్ పేపర్ గా ఉన్న ఈనాడు అసలు తమకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వద్దు అని అధికారికంగా లేఖ ఇచ్చింది. గతానికి బిన్నంగా వైసీపీ ప్రభుత్వం పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. ఇది అంతా అందరికి తెలిసిన విషయమే. ఆదివారం నాడు జగన్ సర్కారు చేసిన పని ఆ రాష్ట్రంలోని ఐఏఎస్ లతో పాటు ఇతర అధికారులను కూడా షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పూట గడవటం కోసం నిత్యం అప్పులు చేస్తూనే ఉంది. ఆ అప్పుల తీరు అలా సాగిపోతుంది. ఒక వైపు పాలన సాగించటం కోసం నిత్యం అప్పులు చేస్తున్న జగన్ సర్కారు ఏకంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్గదర్శి పై ఫుల్ పేజీ జాకెట్ యాడ్స్ ఇచ్చింది. నిజంగా మార్గదర్శి చేసిన తప్పులు ఏమైనా ప్రభుత్వం గుర్తిస్తే ప్రజల శ్రేయస్సు కోసం ఒక పత్రికా ప్రకటన జారీ చేయాలి. అంతే కానీ ఒక ప్రవేట్ కంపెనీ ని టార్గెట్ చేసి కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి సొంత పత్రిక సాక్షితో పాటు తెలంగాణ లో కూడా అటు తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా యాడ్స్ కుమ్మరించారు.

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికారులు కొంత మంది మీడియా సమావేశాలు పెట్టి మరీ మార్గదర్శి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘింస్తోంది అని ఆరోపిస్తున్నారు. వీటిని మార్గదర్శి యాజమాన్యం కూడా ఖండిస్తూ వస్తోంది. అయినా కూడా ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మార్గదర్శి పై జాకెట్ యాడ్స్ తో యుద్ధం ప్రకటించింది. ఇందులోని ఒక్కో అంశానికి మార్గదర్శి కూడా వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కోర్టు కు చేరిన ఈ విషయం తేలాల్సింది కూడా అక్కడే. కానీ ప్రజల సొమ్ముతో జగన్ సర్కారు ఇలా మార్గదర్శిపై ప్రకటనలు ఇవ్వడంపై అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కారు ఇంత చేస్తున్నా కూడా మార్గదర్శి ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళనతో బయటకు వస్తున్న దాఖలాలు లేవు. సీఎం జగన్ కసి కోసం అప్పుల తెచ్చి మరీ ఇలా కోట్ల రూపాయలు ప్రకటనలపై ఖర్చు పెట్టాలా అని ఒక ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News