జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పై మాట్లాడుతూ హడావుడి చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయని విమర్శించారు. వైసీపీ గెలవొద్దనే ఇలా చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు చేతనైతే మిత్రపక్షం బిజెపితో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించాలన్నారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
పరిషత్ ఫలితాలతో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. 98 శాతానికిపైగా స్థానాల్లో వైసీపీ గెలిచిందని, భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పవచ్చని అన్నారు. సీఎం జగన్ పాలను ప్రజలు విశ్వసించబట్టే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. పదవుల్లో అని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కుప్పంలోనే టీడీపీ బోర్లా పడిందని, కుప్పం ఓటర్లు కూడా చంద్రబాబును విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు.