దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులందరూ కలసి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించటం ఆనవాయితీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈసారి ఇడుపులపాయలోని సమాధి వద్ద దివంగత వైఎస్ కు ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల గురువారం ఉదయం నివాళులు అర్పించారు. సాయంత్రం సీఎం జగన్ ఇడుపులపాయను సందర్శించనున్నారు. ఈ అంశంపై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నందున అనవసర వివాదాలు, ఊహగానాలకు ఛాన్స్ ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటానని షర్మిల ప్రకటించారని...జగన్ ఏపీ ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. అంందులో షర్మిళ ఇవాళే పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో కలసి ఇడుపులపాయ వద్దనుకున్నారని తెలిపారు. అనవసర సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే తెలంగాణలో ఎప్పటి నుంచో పార్టీ కార్యకలాపాలు లేవన్నారు.