వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్ రద్దు కావటంతో..ఆయన్ను సీఐడీ కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనను కొట్టారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు కూడా కోర్టు ముందు ఉంచారు. ఇది పెద్ద దుమారం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారంపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. 'రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది.
మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామకృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు. రఘరామకృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసింది. రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది' అని తెలిపారు.