ప్రతిపక్షములో ఉండగా అమరావతి కి ఓకే చెప్పిన జగన్ తర్వాత పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మాట మార్చిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ రగడ మొదలైంది. ఒక వైపు సీఎం జగన్ ఎలాగైనా మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మాత్రం అమరావతి ఒకే ఒక రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. భూములు ఇచ్చిన రైతులు గత కొంతకాలంగా పాదయాత్రలు చేస్తున్నారు, ఈ విషయాలు అన్ని అమరావతి ఫైల్స్ సినిమా లో చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. అధికార పార్టీ మాత్రం ఇది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆరోపిస్తోంది.