వివాదంలో పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహనం !

Update: 2022-12-08 04:37 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి' చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఈ వాహనాన్ని చూసిన ఎవరికైనా ఇది ఒక యుద్ధ ట్యాంక్ తరహాలో కనిపిస్తోంది. కాసేపు ఆ సంగతి పక్క పెడితే ఈ రాజకీయ ప్రచార వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖచ్ఛితంగా తన వాహనం రంగును మార్చాల్సి ఉంటది అని..లేక పోతే ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంటది అని ఒక అధికారి వెల్లడించారు. బుధవారం నాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వారాహి వస్తోంది రాజకీయ యుద్దానికి అన్న తరహాలో వీడియో, ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. భద్రతా పరంగా ఈ వాహనం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటు..ఎక్కడైనా విద్యుత్ సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందులో అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

                                       ఈ ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వారాహి కి రంగు సమస్య వచ్చిపడింది. చూసే వాళ్ళు ఎవరైనా ఇది ఆర్మీ వాహనం అనుకుంటాను కానీ...ప్రచార రధం అనుకోరు. ఎన్నికల యుద్ధ కోసం అన్నట్లు ఈ కలర్ ఎంచుకొన్నట్లు కనిపిస్తోంది కానీ..ప్రైవేట్ వాహనాలకు దీన్ని అనుమతించరు అని చెపుతున్నారు. కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న ఆలివ్ గ్రీన్ రంగు ఉన్న వాహనాలు అన్నింటికీ కలర్ మార్చుకోవాలని లేకపోతే రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని తెలిపారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఈ రంగు ప్రైవేట్ వాహనాలకు వాడటానికి అనుమతించారు. దీంతో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో దీని రంగు మర్చి కానీ ఇందులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళటానికి ఉందని చెపుతున్నారు.

Tags:    

Similar News