కానీ అందుకు బిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు మాత్రమే జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది కూడా త్వరలోనే నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు అనటానికి సంకేతమా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో మొదలైంది. వీళ్లిద్దరికీ మినహాయింపు ఇవ్వటం వల్ల కొంత మంది మంత్రులకు రెండు జిల్లాల ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాధ్యతలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి, అనకాపల్లి జిల్లా బాధ్యతలు కొల్లు రవీంద్ర కు కేటాయించారు. తిరుపతి జిల్లా బాధ్యతలు అనగాని సత్యప్రసాద్, చిత్తూర్ జిల్లా బాధ్యతలు మందపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కి ఇచ్చారు. తాను నేరుగా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉండి అనుకున్న పనులు చేయించుకోవటం కంటే వేరే వాళ్ళను ముందు పెట్టి నడిపించుకోవటం కోసమే ఇలా చేశారు అనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో సాగుతోంది.