ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల దారులు క్లియర్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని విషయంలో క్లారిటీ ఉన్నా...సొంత పార్టీ జనసేన కు చెందిన వారితో పాటు చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఎలాగైనా టీడీపీ, జనసేన పొత్తును బ్రేక్ చేయటం కోసం తెరవెనక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సీఎం పదవి విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రధాన ఉద్దేశం అధికార వైసీపీ ని ఓడించటం, రాష్ట్రాన్ని ఆ పార్టీ నుంచి కాపాడాడటమే అన్నారు. సీఎం పదవి కావాలని టీడీపీ, బీజేపీ ని అడగటం కాదు అని...సొంతంగా సాధించుకోవాలన్నారు. సినిమాల్లో కూడా తాను స్టార్ అయ్యాను అంటే అది అడిగి తీసుకున్నది కాదు అని...సొంతంగా సంపాదించుకున్నది అన్నారు. గత ఎన్నికల్లో 134 సీట్లలో పోటీ చేస్తే కనీసం 30 నుంచి 40 సీట్లలో గెలిపించే ఉంటే అప్పుడు సీఎం సీట్ డీమాండ్ చేయటానికి ఛాన్స్ ఉండేది అన్నారు. బలం ఆధారంగానే గౌరవప్రదమైన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు. గతం కంటే ఇప్పుడు కచ్చితంగా తమ బలం పెరిగింది అని చెప్పారు. అయితే ఎక్కడ బలం ఉందో చూసుకుని ఆ దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను.. ఒక కులం కోసం కాదు. నాతో నడిచేవాళ్లంతా నా వాళ్లే’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు పార్టీలను గౌరవిస్తామని, ఎన్నికలను ప్రభావితం చేసే పార్టీలు కలవాలని ఆకాంక్షించారు.
లెఫ్ట్ పార్టీలు వస్తే మంచిదే.. కానీ వారు రారని విమర్శించారు. తాను పార్టీ పెట్టింది ఉనికి చాటుకోవడానికి కాదని ప్రకటించారు.